శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబ్రిగాం లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈనాం భూముల వ్యవహారంలో ఇరువర్గాలల మధ్య కొట్లాట జరిగింది. 317 ఎకరాల భూమి విషయంలో చాలా వివాదం నెలకొంది. 166 ఎకరాలు రైతులకు ఇవ్వాలని తీర్పు రాగా...ఇప్పటివరకూ 108 ఎకరాలు పంచి 58 ఎకరాలు పెండింగ్ పెట్టడంతో మాజీ సర్పంచ్ వర్గీయులు రైతులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
